ఆదివారం, 19 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-10-2025 శనివారం దినఫలాలు - ఆస్తి వివాదాలు జటిలమవుతాయి....

astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తుల కలయిక వీలుపడదు. విలువైన వస్తువు జాగ్రత్త. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆశించిన పదవి దక్కదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. నిదానంగా అనుకున్నది సాధిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు, బంధువులతో సంభాషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. అప్రమత్తంగా ఉండండి. విలువైన వస్తువులు జాగ్రత్త. ముఖ్యమైన వ్యవహారంలో పాల్గొంటారు. ద్విచక్ర వాహనదారులకు సమస్యలు ఎదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారజయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పదవులు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. విలాసాలకు వ్యయం చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. పనులు సాగవు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు ఎదుర్కుంటారు. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. ఖర్చులు విపరీతం. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పనులు చురుకుగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణ వేధింపులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. మానసికంగా స్థిమితపడతారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సహనం కోల్పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. పత్రాలు సమయానికి కనిపించవు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పట్టుదలతో శ్రమిస్తే విజయం ఖాయం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. కష్టించినా ఫలితం శూన్యం. ఆశావహదృక్పధంతో మెలగండి. ఆదాయం సంతృప్తికరం. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలించవు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారిపోతాయి. ఖర్చులు అధికం, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఊహించని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు సాగవు. నోటీసులు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు విపరీతం. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ తప్పుపట్టవదు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. పనులు మొక్కుబడిగా చేస్తారు. ఆత్మీయుల కలయిక వీలుపడదు. వేడుకకు హాజరుకాలేరు.