1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
  4. Diwali 2025 special tips for diwali snacks

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

Diwali Sweets
Diwali Sweets
దీపావళికి అందరూ పిండి వంటలు చేస్తుంటారు. దీపావళి పిండిపదార్థాలు రుచికరంగా వుండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. దీపావళికి తినుబండారాలు చేసే వారు ఈ టిప్స్ పాటిస్తే వాటి రుచి అదిరిపోతుంది. ముందుగా దీపావళి పిండివంటలు చేసేటప్పుడు వినాయక పూజ తప్పనిసరి. 
 
తమలపాకులో పసుపుతో వినాయకుడిని ఆయనకు కుంకుమ పెట్టి సిద్ధం చేసి వుంచాలి. ఆయనకు గరికను సమర్పించాలి. తర్వాత మొదట చేసే తినుబండారాన్ని నైవేద్యంగా సమర్పించాకే.. ఫలహారాలు చేయడం మొదలెట్టాలి. 
 
దీపావళికి మిక్సర్ చేసిన తర్వాత అందులో రెండు స్పూన్లు పంచదారను చేర్చితే మిక్సర్ రుచికరంగా వుంటుంది. దీపావళికి మీరు ఏ స్వీట్ చేసినా.. అందులో మూడు చిటికెల ఉప్పును చేర్చాలి. దీపావళికి మైసూర్ పాక్ చేసేవారు ఒక కప్పు శెనగపిండికి రెండు కప్పుల పంచదార, 3 కప్పుల నెయ్యిని చేర్చితే.. టేస్ట్ అదిరిపోతుంది. 
 
దీపావళి పిండివంటలు చేసేటప్పుడు నూనె పొంగకుండా వుండాలంటే.. అందులో ఒక చుక్క వెనిగర్ చేర్చుకుంటే సరిపోతుంది. దీపావళికి చేసే తినుబండారాలు చెడిపోకుండా వుండాలంటే.. ఒక తెల్లబట్టలో గుప్పెడు రాళ్ల ఉప్పు చేర్చి, మూట కట్టి.. దానిని తినుబండారాలు వుంచే డబ్బాల్లో వేసివుంచితే సరిపోతుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...