సోమవారం, 12 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జనవరి 2026 (20:06 IST)

రాంగ్ రూటులో వచ్చిన బైకర్.. ఢీకొన్న కారు.. తర్వాత ఏం జరిగిందంటే? (video)

Biker
Biker
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సీసీటీవీల ఆధారంగా రికార్డ్ అయ్యే ఈ ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు దారుణంగా వుంటున్నాయి. అతి వేగంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదో విచిత్ర రోడ్డు ప్రమాదం అనే చెప్పాలి. 
 
రాంగ్ రూటులో వచ్చిన ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. అయితే తర్వాత జరిగిన సీన్ నెటిజన్లలో నవ్వులు పూయించింది. కారుకు ముందు రాంగ్ రూటులో వచ్చిన బైకర్ కారు ఢీకొన్న వెంటనే కారు ముందు పడ్డాడు. 
 
అయితే అంత వేగంగా ఢీకొన్న కారు ముందు ఎగిరి పడి.. కారు ముందు భాగంలోనే అలా పరుండి పోయాడు. అతనికి తీవ్ర గాయాలైనా కారు ఫ్రంట్ డిక్కీపై అలాగే పడుకుని కనిపించాడు. 
 
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రకరకాల మీమ్స్, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు మాత్రం బైకర్‌కు ఏమైందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.