1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Varahi Puja on Krishnapaksha Panchami significance

Varahi Puja: కృష్ణపక్ష పంచమి రోజున వారాహి దేవిని పూజిస్తే..?

Varahi Pooja
కృష్ణపక్ష పంచమి రోజున వారాహి దేవిని పూజించడం సర్వశుభాలను ఇస్తుంది. పంచమి రోజున వారాహి దేవి పూజ అనుకున్న కార్యాలను పూర్తి చేస్తుంది. వారాహి దేవి పూజ శత్రుబాధను తొలిస్తుంది. రుణ విముక్తిని ప్రసాదిస్తుంది. ఈతిబాధలు తొలగిపోతాయి. వారాహి దేవిని పూజించడం ద్వారా నరదిష్టి వుండదు. ఇంకా మాంత్రిక శక్తులు దరిచేరవు. జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలు వేధిస్తుంటాయి. 
 
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అప్పులు, పరిష్కారం కాని సమస్యలు ఇబ్బంది పెడుతుంటే.. వారాహి పూజ తప్పనిసరిగా చేయాలి. శ్రీ విష్ణువుకు చెందిన వారాహ అవతార శక్తి నుంచి ఉద్భవించిన వారాహి దేవి.. ప్రతికూలతలను తొలగిస్తుంది. సానుకూల ఫలితాలను ఇస్తుంది.
 
వారాహి దేవి మాంత్రిక దోషాలను తొలగిస్తుంది. అడ్డంకులను తొలగిస్తుంది. శత్రుబాధను తొలగించి.. భక్తులను కాపాడుతుంది. భక్తుల పట్ల కల్పవృక్షంగా నిలుస్తుంది వారాహిదేవి. అందుకే వారాహి దేవిని కృష్ణపక్ష పంచమి రోజున  పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 
 
ఈ రోజున వారాహి అమ్మవారిని దర్శించడం చేయాలి. అలా కుదరని పక్షంలో ఇంట్లోనే పూజ చేయాలి. ఇంట్లో పంచదీపాన్ని వెలిగించి.. వారాహి దేవిని నిష్ఠతో పూజించాలి. నైవేద్యంగా గారెలు, దానిమ్మ పండ్లు, పెరుగును సమర్పించవచ్చు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
2026 సంవత్సరం నాలుగు రాశుల వారికి అదృష్టం.. ఆ రాజయోగాలతో అంతా శుభమే