సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 12 జనవరి 2021 (17:32 IST)

ఫేస్ బుక్ మోజుతో ఫోటోలు పెట్టింది, వశం చేసుకుని అవసరం తీరాక అంతం చేసాడు

ఇద్దరు పిల్లల తల్లి. ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కుటుంబం వద్దనుకుంది. తనకు ప్రియుడే సర్వస్వం అనుకుంది. అందరినీ వదిలేసి అతనితో వెళ్ళిపోయింది. అయితే ప్రియుడిని నమ్మిన ఆ వివాహిత చివరకు అతని చేతిలోనే ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
తెలంగాణా రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చింతోని చిలక గ్రామానికి చెందిన వెంకటనారాయణ, స్రవంతిలు నివాసముండేవారు. ఇద్దరు పిల్లలు. బాగా పెద్దవారయ్యారు. ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారు. అయితే స్రవంతికి ఫేస్ బుక్ పిచ్చి బాగా ఎక్కువ.
 
ఫేస్ బుక్‌ను ఓపెన్ చేసి తన ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ ఉండేది. భర్త ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినిపించుకునేది కాదు. ఇలా ఫేస్ బుక్‌లో పరిచయమ్యాడు సురేందర్ అనే వ్యక్తి. అతను ఔషధాలను విక్రయిస్తూ ఉండేవాడు. బస్సులో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.
 
మీరు ఫేస్ బుక్‌లో ఉన్న స్రవంతి కదూ అంటూ మాటలు కలిపాడు సురేందర్. అంతే... అతని మాటల్లో పడిపోయిన స్రవంతి అతనికి తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసింది. ఇలా వారిద్దరి మధ్య పరిచయం కాస్త చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా ఇద్దరూ ఏకాంతంగా కలిసేవారు.
 
ఔషధాలు అమ్మే సురేందర్ ఆమెకు మాయమాటలు చెప్పాడు. దీంతో కుటుంబాన్ని పూర్తిగా వదిలేసి వచ్చేసింది స్రవంతి. ఇతనితోనే రెండు నెలలుగా కాపురం పెట్టేసింది. ఇద్దరూ కలిసి కెపిహెచ్‌బీ సమీపంలో కాపురం పెట్టారు. అయితే సురేందర్ మద్యానికి బాగా బానిస.
 
ప్రతిరోజు మద్యం తాగి రావడంతో స్రవంతికి, అతనికి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ అతిగా మద్యం సేవించిన సురేందర్ ఆ మత్తులో స్రవంతితో గొడవ కారణంగా ఆమెను చంపేశాడు. ఆ తరువాత ఆ శవం పక్కనే రెండు రోజుల పాటు నిద్రించాడు కూడా. ఇంటి అద్దెను చెల్లించి మరీ అక్కడి నుంచి మెల్లగా పారిపోయాడు. అయితే మృతదేహం కారణంగా వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.