ఆ కంపెనీలకు వాట్సప్‌ను అస్సలు వాడొద్దంటున్నాయ్.. ఎందుకు..?

whatsapp
whatsapp
సెల్వి| Last Updated: సోమవారం, 11 జనవరి 2021 (11:56 IST)
వాట్సాప్‌కు ఏమైంది.. టాప్ మేసేజింగ్ యాప్‌గా కొనసాగిన వాట్సాప్‌కు ప్రస్తుతం కష్టాలు మొదలైనాయనే చెప్పాలి. టాటా స్టీల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు, ఇండియన్, మల్టీ నేషనల్ కంపెనీలు తమ స్టాఫ్‌ను వాట్సప్ వాడొద్దని సూచిస్తున్నాయి. ముఖ్యంగా క్రిటికల్ బిజినెస్ కాల్స్‌కు వాట్సప్‌ను అస్సలు వాడొద్దని చెబుతున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీసు నిబంధనల ఆధారంగా పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో డేటా షేర్ చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు, కన్సల్టంట్లు.. కంపెనీలు తమ ఉద్యోగులకు వాట్సప్‌ను దూరంగా ఉంచాలని చెప్పమంటున్నారు. పార్లమెంటరీ కమిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై మీట్ అయి వాట్సప్ ప్రైవసీ అప్ డేట్‌పై చర్చించేందుకు రెడీ అయింది. టాటా స్టీల్ తమ ఉద్యోగులకు కార్పొరేట్ విషయాలు లాంటి ఇంపార్టెంట్ విషయాలను బిజినెస్ మీటింగులను వాట్సప్ ద్వారా పంపొద్దని సూచిస్తుంది.

కొత్త పాలసీ ప్రకారం.. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో సాధ్యమైనంత వరకూ ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటుంది. దీనిపై స్పందించాలని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఫెసిలిటీస్, అఫీషియల్ కమ్యూనికేషన్‌ను కోరామని మృనాల్ కాంతి పాల్ తెలిపారు.దీనిపై మరింత చదవండి :