శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 జనవరి 2021 (10:13 IST)

చాటింగ్ చేస్తూ చేస్తూ ఐ లవ్ యు అని చెప్పాడు.. ఆ తర్వాత?

ఎంబీఎ చదువుతున్న తన సహ విద్యార్థినితో చాటింగ్ చేస్తూ చేస్తూ ఓ విద్యార్థి ఐ లవ్ యు అని మెసేజ్ పెట్టాడు. అప్పటివరకూ స్నేహితుడుగా వున్న ఆ వ్యక్తి అలా చెప్పేసరికి సదరు విద్యార్థిని షాక్ తిన్నది. ఇక అతడితో చాటింగ్ చేయడం మానేసింది. దీనితో ఆగ్రహం చెందిన ఆ యువకుడు ఆ విద్యార్థినిని కాల్ గర్ల్ అంటూ ఓ డేటింగ్ వెబ్ సైట్లో పెట్టి వేధింపులకు పాల్పడ్డాడు.
 
పూర్తి వివరాలు చూస్తే... కింగ్ కోఠీలో నివాసం వుండే సమీర్ ఇబ్రహీంపట్నం ఎంఆర్ఎం కాలేజీలో ఎంబీఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తన క్లాస్ మేట్ అయిన విద్యార్థినితో పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఐతే అతడు స్నేహం పేరుతో దగ్గరై ప్రేమిస్తున్నానంటూ తన కోరికను బయటపెట్టాడు. దీనితో షాక్ తిన్న యువతి అతడిని దూరం పెట్టేసింది.
 
ఆమె తనను దూరం పెట్టిందని ఆగ్రహించిన అతడు ఆమె ఫోన్ నెంబరు, ప్రొఫైల్ ఫోటోను జతచేసి ఓ డేటింగ్ సైట్లో కాల్ గర్ల్ అంటూ పోస్ట్ చేసాడు. ఇది గమనించిన విద్యార్థిని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసారు.