శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (20:26 IST)

పొలంలో నమ్రత ఏం చేస్తున్నారో..?

సూపర్‌ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ నమ్రత తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. హైదరాబాద్‌లోని తమ ఫాంలో పర్యటిస్తున్న వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ అభిమానులతో పంచుకున్నారు. నమ్రత వారి పొలంలో పండిన బేబీ టమాట, ఎర్ర మిరపకాయలు, పత్తి, బెండకాయ తోటలను చూపిస్తూ మురిసిపోయారు. 
 
అంతేగాక కోసిన వరిపంట చూపిస్తూన్న వీడియోకు.. 'పొలంలో పండిన వాటి కంటే తాజా కూరగాయలు ఇంకేముంటాయి. ఐ లవ్‌ ఇట్‌' అనే క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.