ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.5 శాతం వడ్డీని..?
ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ వడ్డీ రేటును విభజించి రెండు విడతలుగా ఇస్తామని సెప్టెంబర్‌లో ప్రకటించింది.
మొదటి విడతగా 8.15 శాతం, రెండో విడతగా 0.35 శాతం ఇచ్చేందుకు నిర్ణయంచింది. ఇందులో భాగంగా మొదటి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్ బాలెన్స్‌ను ఎస్‌ఎంఎస్, ఆన్‌లైన్, మిస్డ్ కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో న్యూ-ఇయర్ కానుకగా సుమారు ఆరు కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారుకు నిర్దేశిత వడ్డీరేటును అందించనుంది. ఇందులో భాగంగా 2019-20 ఏడాదికిగాను వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు. 2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్ మొత్తంపై తొలి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.