నా భర్తతో నేనుండలేను, ప్రేమికుడే గుర్తొస్తున్నాడు, అందుకే..
పెద్దల ఒత్తిడితో ప్రేమించినవాడిని కాకుండా మరో వ్యక్తితో వివాహం చేసుకున్న ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన మనసులో ఎవరు వున్నారో నీకు తెలుసు అమ్మా... పెళ్లయ్యాక ఈ భర్తతో నేను వుండలేకపోతున్నాను, అనుక్షణం నా ప్రేమికుడే గుర్తుకు వస్తున్నాడు, అందుకే చనిపోవాలనుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయింది.
వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా లోని నారాయణగిరికి చెందిన రవళికి, గాంధీనగర్‌కు చెందిన రాజుతో ఈ నెల 11న వివాహం జరిగింది. ఐతే రవళి ఇంతకుమునుపే మరో యువకుడిని ప్రేమించింది. కానీ పెద్దల ఒత్తిడి కారణంగా రాజును వివాహం చేసుకుంది. కానీ తనకు ప్రేమికుడే గుర్తుకు వస్తున్నాడనీ, అందువల్ల చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.