మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: ఆదివారం, 20 డిశెంబరు 2020 (19:58 IST)

వివాహేతర సంబంధం: ముగ్గురు లాయర్లు, ఒక బ్యాంకు మేనేజరును లోబరుచుకుని...

ఆమె అందగత్తె. ఆ అందమే ఆమెను కోటీశ్వరాలిని చేసింది. శ్రీలంకు చెందిన హసీనా, తమిళనాడుకు చెందిన యూసఫ్‌కు గత ఐదేళ్ళ క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరు కువైట్‌కు వెళ్ళారు. వీరి పరిచయం ఫేస్ బుక్ లోనే జరిగింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. యూసఫ్‌ను పెళ్ళి కూడా చేసేసుకుంది. పెళ్లి తరువాత తమిళనాడులోని తంజావూరులో కాపురం పెట్టాడు యూసఫ్. తమిళనాడుకు వచ్చిన తరువాత వారానికి ఒకసారి తిరుచ్చికి వెళ్లేవాడు యూసఫ్. భర్తపై అనుమానం వచ్చింది హసీనాకు. 
 
అందుకే అతని గురించి తెలుసుకోవాలనుకుంది. యూసఫ్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకుంది. అయితే యూసఫ్ బాగా ఆస్థిపరుడు కావడంతో అతన్ని వదిలిపెట్టలేదు. మళ్ళీ పనిమీద కువైట్‌కు వెళ్ళాల్సి వచ్చింది యూసఫ్‌కు. దీంతో మొత్తం డబ్బులు, నగల వ్యవహారాన్ని హసీనాకు అప్పగించాడు. ఇదే అదునుగా భావించి బాగా ఎంజాయ్ చేసింది హసీనా. షాపింగ్‌లు, షికార్లతో బాగా డబ్బులు ఖర్చు చేసింది. అంతటితో ఆగలేదు. ఖాళీ సమయాల్లో ఫేస్‌బుక్‌లో చాట్ చేస్తూ ఏకంగా నలుగురు యువకులతో పరిచయం పెంచుకుంది.
 
ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతటితో ఆగలేదు. తన భర్త ఆస్థి మొత్తం తనకే కావాలన్న ఉద్దేశంతో ముగ్గురు లాయర్లకు దగ్గరైంది. తన అందంతో వలవేసి ఆస్తిని తనపేరు మీద రాయించుకునేందుకు ప్లాన్ చేసింది. దాంతోపాటు భర్త దాచి ఉంచిన బ్యాంక్ లాకర్లలోని బంగారాన్ని కూడా నొక్కాయాలనుకుంది. కానీ బ్యాంకు మేనేజర్ ఒప్పుకోలేదు. అతనికి కూడా తన అందాన్ని అర్పించింది. ఇలా నలుగురు యువకులు, ముగ్గురు లాయర్లు, ఒక బ్యాంకు మేనేజర్‌కు దగ్గరై కొద్దికొద్దిగా ఆస్థిని లాగేయడం మొదలుపెట్టింది.
 
బాగానే కూడబెడుతోంది. తన ఆస్థి మొత్తాన్ని లాగేసుకుంటుందన్న విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు యూసఫ్. కువైట్ నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే తన స్నేహితులను పోలీసు స్టేషన్‌కు పంపించి ఫిర్యాదు చేయించాడు. అయితే హసీనా మాత్రం దొరికిన దాంతో ఉడాయించింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది.