మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (14:12 IST)

అత్తతో అల్లుడు వివాహేతర సంబంధం, తెలియడంతో ఇద్దరూ కలిసి...

అత్తతో అల్లుడు జరిపిన వివాహేతర సంబంధం కారణంగా ఆ ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. ఒకే వయసు కలిగిన వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలోని పెద్దజాలుగుంట దగ్గర ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు స్థానికులు గమనించారు. వెంటనే సమాచారాన్ని పోలీసుకు తెలియజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.
 
వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం వున్నట్లు తేలింది. ఆత్మహత్యకు పాల్పడిన 35 ఏళ్ల సుమన్, తనకు అత్త వరసయ్యే 35 ఏళ్ల మాధవితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో మనస్థాపం చెంది ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.