మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:14 IST)

వివాహేతర సంబంధం, భర్త మందలించడంతో పుట్టింటికెళ్లి అక్కడ కూడా...

ఇద్దరు పిల్లలు. సజావుగా సాగుతున్న సంసారం. ఉదయం వెళితే రాత్రికి ఇంటికి వచ్చే భర్త. కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అయితే చాలీచాలని జీతాలు ఆమెను బాగా కుంగదీశాయి. దాంతో పాటు అలసిపోయి వచ్చిన భర్త శృంగారం చేయకపోవడంతో కోర్కెలను నిలువరించుకోలేకపోయింది. పెడదారి పట్టిన వివాహిత చివరకు ప్రాణాలను కోల్పోయింది.
 
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని కాలవట్టి నెహ్రూనగర్‌లో నివాసముంటున్న తిలకవతి, సెల్వరాజ్‌లకు ఐదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు సెల్వరాజ్. అయితే కరోనా సమయంలో కావడంతో ఫ్యాక్టరీల్లో ఉద్యోగులను తగ్గించారు. దాంతో పాటు జీతాన్ని కూడా సెల్వరాజ్‌కు తగ్గించారు.
 
వచ్చే జీతం సరిపోక ఆర్థిక ఇబ్బందులు పడుతుండేది సెల్వరాజ్ కుటుంబం. భార్యకు కోర్కెలు ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒకటి కొనివ్వమని చెబుతూ ఉండేది. దీంతో ఇద్దరి మధ్యా గొడవలు తరచుగా జరుగుతుండేది. దాంతో పాటు ఉదయం పనికి వెళితే రాత్రికి గానీ ఇంటికి వచ్చేవాడు కాదు సెల్వరాజ్.
 
ఇంటికి వచ్చినా బాగా అలసిపోవడంతో నిద్రపోయేవాడు. దీంతో తిలకవతి పక్కదారి పట్టింది. తన ఇంటికి సమీపంలో ఉన్న కొంతమంది కాలేజీ విద్యార్థులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ముగ్గురు విద్యార్థులకు దగ్గరై తన కోర్కెలను తీర్చుకుంటూ ఉండేది.
 
భర్తకు విషయం తెలిసింది. ఎన్నోసార్లు మందలించాడు. అయినా ఆమెలో మాత్రం మార్పు రాలేదు. నీతో సంసారం చేయనంటూ ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండు నెలల నుంచి పుట్టింటిలోనే ఉంటున్న తిలకవతి అక్కడ కూడా తన బాగోతాన్ని మొదలుపెట్టింది.
 
ఇంటి పక్కనే పద్మనాభం అనే చికెన్ వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను బాగా సంపాదిస్తుండటం చూసి అతని వలలో పడిపోయింది. ఇలా అడ్డూఅదుపూ లేకుండా వీరి బాగోతం సాగింది. తిలకవతి పద్మనాభంను పెళ్ళి చేసుకోమంటూ ఒత్తిడి తెస్తూ వస్తుండేది.  
 
ప్రతిసారి ఏదో ఒకటి చెబుతూ తప్పించుకునేవాడు పద్మనాభం. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. తిలకవతి కారణంగా పద్మనాభంకు తన భార్యతో తరచూ గొడవలు రావడంతో పక్కనే ఉన్న షెడ్‌ను ఎంచుకున్నారు. ఉదయాన్నే అక్కడ పేకాట ఆడుతూ మద్యం సేవించారు. 
 
రాత్రి అయితే ఖాళీగా ఉండేది. ఇదే అదునుగా భావించిన పద్మనాభం తిలకవతిని పిలిపించుకుని శృంగారంలో మునిగితేలేవాడు. కానీ శృంగారం తరువాత ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. పెళ్ళి చేసుకోవాలని తిలకవతి పట్టుబట్టడంతో ఆమెను దారుణంగా రాళ్ళతో కొట్టి చంపేశాడు. విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని అక్కడే తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.