1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Mi 10i India Launch Confirmed for January 5, Teased to Feature a ‘Brand New’ Camera Sensor

షియోమీ నుంచి 5జీ ఫోన్.. Mi 10i 5G పేరుతో అదుర్స్

Mi 10i India
Mi 10i India
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షియోమీ నుంచి మరో అద్భుతమైన ఫోన్‌ వచ్చేస్తోంది. కొత్త ఏడాది తొలి వారంలోనే 108 మెగాపిక్సల్‌ రిజల్యూషన్‌తో సరికొత్త కెమెరా సెన్సార్‌తో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.

ఈ ఏడాది విడుదలైన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు Mi 10, Mi 10T, Mi 10T Proలకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నారు. Mi 10i 5G అనే ఈ ఫోన్‌ను భారత్‌లో జనవరి 5న లాంచ్‌ చేయబోతున్నట్లు షియోమీ ఇండియా చీఫ్‌ మను కుమార్‌ జైన్‌ తెలిపారు. 
 
షియోమీ ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్లు (అంచనా):
ఫ్రంట్‌ కెమెరా:16 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా: 108+8+2+2 మెగా పిక్సల్‌
ర్యామ్‌:6జీబీ
స్టోరేజ్‌:128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4820ఎంఏహెచ్‌
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10
డిస్‌ప్లే:6.67 అంగుళాలు
ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ.
తర్వాతి కథనం
నా భర్తతో నేనుండలేను, ప్రేమికుడే గుర్తొస్తున్నాడు, అందుకే..