శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (21:09 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్... వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ కస్టమర్ల కోసం..?

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ వాట్సాప్ వినియోగదారులు వినియోగిస్తున్న ఆడియో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్‌లను వచ్చే ఏడాదిలో వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు పేర్కొంది. 
 
వాబీటాఇన్ఫో ప్రకారం.. వాయిస్ కాలింగ్, వీడియో కాల్‌ ఫీచర్ లు డెస్క్‌టాప్ బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదిలో మిగతా అందరికి లభించనున్నట్లు పేర్కొంది. ఈ కాలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక పాప్ అప్ వస్తుంది వాట్సాప్ తెలిపింది. 
 
కాగా.. వాట్సాప్ యూజర్లు వచ్చే ఏడాదిలో రాబోయే వాట్సాప్ కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీలను అంగీకరించాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఒకవేల ఎవరైతే ఈ నిబంధనలను అంగీకరించారో వారు వాట్సాప్ ఖాతాని తొలిగించనున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలను 2021 ఫిబ్రవరి 8 నుండి తీసుకురానున్నట్లు పేర్కొంది.