1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. A film featuring Vinod Kumar and Suhasini.

Suhasini : వినోద్ కుమార్, సుహాసిని కాంబినేషన్ లో సినిమా

Vinod Kumar, Suhasini
Vinod Kumar, Suhasini
వందకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో దర్శకుడు చెప్పిన కథ విని చాలా ఎగ్జైట్ అయ్యా. మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం వుందని సీనియర్ నటుడు  వినోద్ కుమార్ తెలియజేస్తున్నారు. సన్ ఆఫ్ మూవీ లో నటిస్తున్న ఆయనను పలుకరిస్తే ఇలా తెలియజేస్తున్నారు. నేడు టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్ వచ్చారు.
 
 
ఈ సందర్భంగా సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ, సన్ ఆఫ్ మూవీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు.. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. రెగ్యులర్ లైఫ్ లో ఓ తండ్రి, కొడుకుల మధ్య సాగే స్టోరీ ఇది. ఇందులో హీరోగా నటించినసాయి సింహాద్రి ఎక్కడో పర్లాకిమిడిలో చదివి... అమెరికాకు వెళ్ళి... అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా తీశారు. ఇది గ్రేట్ అచివ్ మెంట్. దర్శకుడు సతీష్ 45 నిమిషాలు స్టోరీ ఎక్స్ట్రార్డినరీ గా నెరేషన్ చేశారు. తన స్టోరీ విని మా అబ్బాయికి కూడా చెప్పాను.  తండ్రి కొడుకుల మధ్య సాగే ఒక మంచి స్టోరీ చెప్పాడని నా అనుభవంతో చెప్పాను.
 
నేను వందకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో చెబుతున్నా  దర్శకుడు బత్తల సతీష్ జీనియస్. అతను దర్శకుడు పూరీ జగన్నాథ్ అభిమాని. ఆయన ఎంతో కమిట్ మెంట్ తో ఈ సినిమా చేశారు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. 
 
నేను ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. 40 రోజుల పాటు షూటింగ్ చేశా. మారెమ్మ చిత్రంలో నటిస్తున్న. అలాగే సుహాసిని తో కలిసి ఓ సినిమా చేస్తున్నా" అన్నారు.
 
About Writer
దేవీ
తర్వాతి కథనం
నీ చెస్ట్ పైన మోర్ ప్యాడింగ్ వేసుకో అనేవారు: రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్