సంబంధిత వార్తలు
- కార్తీక దీపం సీరియల్ క్రేజ్ అది.. ప్రేమ విశ్వనాథ్ టీవీ కొనిపెట్టేసిందిగా..?
- వంటలక్క పేరును అలా వాడేస్తున్న ఫ్యాన్స్?
- సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా వివాహం
- లక్ష్ హీరోగా "గ్యాంగ్‌స్టర్ గంగరాజు" టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- బిగ్ బాస్ నాలుగో సీజన్.. సన్ డే సూపర్ సేవ్డే.. ఆ ఇద్దరూ సేవ్
''కార్తీక దీపం'' నిరుపమ్ వాయిస్‌కు ఏమైంది..? సోషల్ మీడియాలో చర్చ
Nirupam
ఆ సీరియల్‌లో డాక్టర్ కార్తీక్ క్యారెక్టర్ చేస్తోన్న నిరుపమ్ పరిటాల, దీప పాత్రధారి ప్రేమి విశ్వనాథ్‌కు వీక్షకుల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. నిరుపమ్ ఎవరో కాదు.. సినీ రచయితగా మంచి పేరు పొందిన దివంగత ఓంకార్ కుమారుడు.
ఈ విషయం పక్కనబెడితే.. 'కార్తీక దీపం' లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..? కార్తీక్ (నిరుపమ్) గొంతు మారిపోవడం. ఇప్పటిదాకా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చిన నిరుపమ్‌కు ఇప్పుడు ఎవరో గొంతును అరువిస్తున్నారు. ఇది చాలామందికి నచ్చినట్లు లేదు. అందుకు సోషల్ మీడియాలో నిరుపమ్‌నే నేరుగా అడిగేస్తున్నారు ఫ్యాన్స్. ఆదివారం నిరుపమ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన ఫొటోనొకదాన్ని షేర్ చేశాడు.
అది.. ఇటీవల దసరా కోసం తోటి నటులతో కలిసి చేసిన ఓ టీవీ షోకు సంబంధించింది. దాంతో పాటు, "మీరు నియంత్రించలేని దాని గురించి బాధపడే బదులు, మీరు సృష్టించగల దాని కోసం మీ శక్తిని బదలాయించండి" అనే కోట్‌ను జోడించాడు.
దీనిని మెచ్చుకుంటూనే కామెంట్ సెక్షన్స్‌లో అనేకమంది మంది ఫ్యాన్స్ 'కార్తీక దీపం'తో పాటు ఇతర సీరియల్స్‌లో అతని గొంతు ఎందుకు మారిపోయిందనీ, ఏం జరిగిందనీ ప్రశ్నల పరంపర కురపించారు. ఒక అభిమాని, "సీరియల్స్‌లో మీ వాయిస్‌ను మార్చేశారు. ఎందుకు?" అని ప్రశ్నించాడు.
"కార్తీక దీపంలో మీ వాయిస్ మ్యాచ్ అవలేదు. ఫస్డ్‌దే బావుంది క్యూట్‌గా ఉంటుంది కార్తీక్ గారు. ప్లీజ్ చేంజ్ ద వాయిస్" అని కామెంట్ పెట్టారు. అయితే ఈ కామెంట్స్‌కు ఇంతదాకా నిరుపమ్ ఆన్సర్ ఇవ్వలేదు. సీరియల్ నిర్మాతలు ఎందుకు నిరుపమ్ వాయిస్ బదులు డబ్బింగ్ వాయిస్ పెట్టారనేది వెల్లడి కావాల్సి ఉంది.
తర్వాతి కథనం
