గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (14:59 IST)

వాట్సప్ వినియోగదారులకు అలర్ట్ న్యూస్... Terms and Privacy Policy..?

వాట్సప్ వినియోగదారులకు అలర్ట్. ఉదయం వాట్సాప్ యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా? ఇలాంటివి ఎప్పుడూ కనిపిస్తాయిలే అని లైట్ తీసుకున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఆ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయకపోతే వాట్సప్ పనిచేయదు. వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది.
 
వాట్సప్ అప్‌డేట్ చేసిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ 2021 ఫిబ్రవరి 8న అమలులోకి రానుంది. ఈ కొత్త ప్రైవసీ రూల్స్ అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఫిబ్రవరి 8 లోగా కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాల్సిందే.
 
కాబట్టి యూజర్లు కొత్త ప్రైవసీ రూల్స్‌ని అంగీకరించాల్సి ఉంటుంది. లేకపోతే మీ వాట్సప్ అకౌంట్ డిలిట్ చేసే అవకాశం ఉంది. అంటే మీరు వాట్సప్ యాప్ ఎప్పట్లా ఉపయోగించాలనుకుంచే కొత్త ప్రైవసీ రూల్స్‌ని అంగీకరించాల్సిందే. సాధారణంగా ఏ యాప్ డౌన్‌లోడ్ చేసినా టర్మ్స్ అండ్ కండీషన్స్ ఉంటాయి. వాటిని అంగీకరిస్తేనే యాప్ ఉపయోగించుకోవచ్చు. లేకపోతే యాప్ ఓపెన్ చేయడానికి కూడా రాదు. 
 
యాప్ డెవలపర్స్ తరచూ టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్‌డేట్ చేస్తుంటాయి. ఇప్పుడు వాట్సప్ కూడా నియమనిబంధనల్ని అప్‌డేట్ చేసింది. 2021 జనవరి 4న అప్‌డేట్ చేసిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీకి సంబంధించిన సమాచారం యూజర్లకు అందుతోంది.