గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (14:40 IST)

కరోనా కష్టకాలంలోనూ ఇంటిని కొనుగోలు చేసిన హీరోయిన్.... ఎవరు?

కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులయ్యాయి. అనేక కోట్ల కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది చిన్న నటీనటులు కూడా పూట గడవక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి కష్టాల్లోనూ ఓ హీరోయిన్ సొంతంగా ఇంటిని కొనుగోలు చేసింది. ఆమె ఎవరో కాదు.. విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల గారాపట్టి శృతిహాసన్. ఓ సినీ హీరోయిన్. 
 
ఆమె తాజాగా మాట్లాడుతూ, త‌ను ఇండిపెండెంట్‌గానే ముందుకు వెళుతున్న‌ట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను ఎవ‌రిపై ఆధార‌ప‌డనని తేల్చి చెప్పింది. అమ్మ‌, నాన్న సాయం నేను ఎప్పుడు తీసుకోను. నా కాళ్ల మీద నిల‌బ‌డ‌టానికే నేను ప్ర‌య‌త్నిస్తాను. నా ఖ‌ర్చుల‌కి నేనే సంపాదించుకుంటాను. నా బిల్లులు చెల్లించుకోవాలి అంటే ప‌ని చేయ‌క త‌ప్ప‌దు. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలని వివరించింది. 
 
అంతేకాకుండా, గ‌తంలో ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాను. క‌రోనా ఎప్పుడు అంతం అవుతుంది అనే దాని కోసం నేను వెయిట్ చేయ‌ను. నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్ నుండి పిలుపు వ‌స్తే షూటింగ్‌కు వెళ‌తాను. అంద‌రిగానే నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాటి కోస‌మైన ప‌ని చేయ‌క త‌ప్ప‌దు. వ్య‌క్తిగ‌తం, వృత్తి ప‌ర‌మైన నిర్ణ‌యాలు సొంతంగా తీసుకుంటాను. 
 
క‌రోనా వ‌ల‌న చాలా మంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని చెబుతుంటారు. నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. స్వ‌యం కృషితో ఎద‌గ‌డం నేను చాలా ఇష్ట‌ప‌డ‌తాను. నా వెనుకు దేవుడు ఉన్నాడ‌ని బలంగా విశ్వ‌సిస్తాను అంటూ శృతి హాస‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.