గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (10:27 IST)

తల్లితో కామవాంఛ తీర్చుకుని... ఆపై హత్య చేసిన కుమారుడు.. ఎక్కడ?

ఇటీవలి కాలంలో అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కిరాతకుడు కన్నతల్లిపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అత్యంత పాశవికంగా చంపేశాడు. ఈ దారుణం మదర్స్ డేకు సరిగ్గా ఒక్కరోజు ముందు అమెరికాలో జరిగింది. 
 
సదరు నిందితుడు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. తల్లిని హతమార్చిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నిందితుడు తన నేరం ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. 
 
తాను నిద్ర లేవడమే ఎవరో ఒకరిని తీవ్రంగా గాయపరచాలనే కోరిక కలిగిందని, దాన్ని తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడట. అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది కూడా భారత సంతతికి చెందిన కిరాతకుడే కావడం గమనార్హం.