శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (09:33 IST)

చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి కన్నుమూత

గుంటూరు జిల్లా చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి మృతి చెందింది. ఇటీవల ఈమె తన స్టేషన్‌లోనే తనకంద పని చేస్తే కానిస్టేబుల్‌లో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. ఈ క్రమంలో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె కన్నుమూశారు. 
 
ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శ్రావణి తొలుత కొంతకాలంపాటు నరసరావుపేటలోని దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవీంద్రతో ఆమె సన్నిహితంగా మెలిగేవారు.
 
ఈ క్రమంలో గత శనివారం ఇద్దరూ కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం వారిద్దరూ స్వయంగా కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. 
 
తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు వారిని తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. కానీ, కానిస్టేబుల్ రవీంద్రకు చికిత్స కొనసాగుతోంది.