శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 మే 2021 (16:16 IST)

corona second wave: ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు ఒక్కసారిగా మృతి

కర్నాటకలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన 24 మంది రోగులకు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా కర్ణాటకలోని చమరాజనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
ఐతే ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఆసుపత్రిలోని 24 మంది కరోనా రోగులు చనిపోయారు. ఆక్సిజన్ అందకే వారు మరణించారని వారి తరపు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే చమరాజనగర్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎంఆర్ రవి మాట్లాడుతూ, ఆక్సిజన్ లేకపోవడంతో రోగులు మరణించారా లేదా వేరే కారణమా అనేది ఇంకా తేల్చలేదు.
 
"ఆక్సిజన్ లేకపోవడం వల్ల అందరూ చనిపోయారా అని మేము చెప్పలేము," అని చెప్పాడు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. ఈ సంఘటనపై తాను చమరాజనగర్ జిల్లా కమిషనర్‌తో మాట్లాడానని, మంగళవారం సాయంత్రం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని కూడా పిలిచానని కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప తెలిపారు.