ఉక్కు మనిషిని పిండి చేసేసిన కరోనా, బాడీ బిల్డర్ జగదీష్ కరోనా కాటుతో మృతి
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
బరోడాలోని నవీ ముంబైలో నివసిస్తున్న జగదీష్ గతేడాది జిమ్ ప్రారంభించాడు. ఆ కారణం చేత అతను బరోడాలో ఉంటూ వచ్చాడు. జగదీష్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. చివరకు ఆయన శుక్రవారం కన్నుమూశారు.
జగదీష్ పోటీకి నిలబడితే, పతకం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అతడి వంపులు తిరిగిన కండలు, బాడీ ఆకృతి ముందు మిగిలినవారు తేలిపోతారు. జగదీష్ ఆ ఆకృతి కోసం చాలా కష్టపడ్డాడు. అతను ప్రతి ఉదయం లేచి రెండు గంటలు వ్యాయామం చేసేవాడు. ప్రోటీన్, చికెన్, గుడ్లు మరియు మాంసంతో పాటుగా మంచి ఆహారం రోజువారీ తీసుకునేవాడు.
జగదీష్ లాడ్ చిన్న వయస్సులోనే బాడీబిల్డింగ్ ప్రారంభించాడు. మహారాష్ట్రలో దాదాపు నాలుగు సార్లు బంగారు పతకం సాధించాడు. మిస్టర్ ఇండియా పోటీలో రెండు బంగారు పతకాలు కూడా గెలుచుకున్నాడు. ముంబైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.
ఆయన మరణానికి మహారాష్ట్ర బాడీబిల్డింగ్ అసోసియేషన్, ముంబై అసోసియేషన్ విచారం వ్యక్తం చేశాయి. బాడీబిల్డింగ్ ప్రపంచంలో సుపరిచితమైన వ్యక్తిని కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేసాయి.
తర్వాతి కథనం
