సంబంధిత వార్తలు
- లోక్‌సభ మాజీ స్పీకర్ చనిపోయిందంటూ ట్వీట్... స్పందించిన సుమిత్రా మహాజన్
- గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో కరోనా మరణమృదంగం .. ఒక్క రోజే...
- కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... 13 మంది మృత్యువాత
- మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాం కరోనాతో మృతి, హోం ఐసొలేషన్‌లో చెర్రీ
- కరోనాతో చనిపోయిన ఈనాడు విలేకరి: కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీశ్ రావు
పొట్టి వీరయ్య మృతి
Potti veerayya
సాయంత్రం 5.30 నిముషాలకు ఆసుపత్రినుంచి ఇంటికి తీసుకువచ్చారు. మా అసోసియేషన్ నుంచి ప్రతినిధి రానున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో జరగనున్నాయి.
పొట్టివీరయ్య కు 74 సంవత్సరాలు. 2అడుగుల మాత్రమే వుండే ఆయన ఆహార్యం ఆయనకు ప్రత్యేకత. ఇదే ఆయనకు సినిమాలలో వేషాలు రావడానికి కారణమైంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలనుంచి కలర్ సినిమాలవరకు జనరేషన్‌లో నటించి మెప్పించిన నటుడు ఆయన. చాలాకాలంపాటు తన ఆహార్యానికి తగిన పాత్రలు వేస్తూ చెన్నై, హైదరాబాద్‌లో గడిపారు. హైదరాబాద్ సినిమా రంగం తరలివచ్చాక పలు వేషాలు వేశారు. కానీ ఆయన కుటుంబపోషనకు అది సరిపోయేదికాదు. అప్పడప్పుడు వేషాలు వస్తుండేవి. కనుక ఆయన వికలాంగుల కోటా కింద హైదరాబాద్ కృష్ణానగర్‌లో బడ్డీకొట్టు పెట్టుకుని జీవనం సాగించేవారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ప్రస్తుతం ఆయన తన కుమార్తె వనజ దగ్గర వుంటున్నారు.
ఆదుకున్న ప్రభాకర్‌రెడ్డి చిత్రపురి కాలనీ
సినిమారంగంలోని 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులకు షేక్‌పేట దగ్గరలోని కాజాగూడ గ్రామం వద్ద అప్పట్లో నటుడు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వరర్యంలో చిత్రపురి కాలనీ ఏర్పాటుకు కృషి చేశారు. ఆ సమయంలో పలు సందర్భాలలో పొట్టి వీరయ్య పలువురిని కలిసిన సందర్భాలున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు కూడా అయిన ఆయనకు చిత్రపురిలో స్వంత ఇల్లు కూడా దక్కింది. ఆ తర్వాత వయస్సురీత్యా వచ్చిన అనారోగ్యాలు ఆయన ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయి.
మా అసోసియేషన్
ఈ విషయం తెలిసిన `మా` అసోసియేషన్ ఆయనకు ఫించన్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పలు సందర్భాలలో వైద్య సహాకారం కూడా అందించింది. ఆయన అందరికీ తనలో నాలుకలా వుండేవాడు.
తర్వాతి కథనం
