సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మే 2021 (10:15 IST)

నాగ్‌పూర్ వైద్యురాలు ఎంత పని చేసింది..?

కోవిడ్ సంక్షోభంలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యమిస్తూ తన పెళ్లిని విరమించుకున్నారు ఓ వైద్యురాలు. కోవిడ్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో వారికి వైద్య సేవలు అందించేందుకు గాను తన పెళ్లిని నాగ్ పూర్ వైద్యురాలు రద్దు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, నాగ్‌పుర్‌లోని సెంట్రల్‌ ఇండియా కార్డియాలజీ ఆసుపత్రిలో అపూర్వ మంగళగిరి వైద్యురాలు. గత నెల 26న ఆమె వివాహం జరపాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారు. అయితే కొవిడ్‌ రోగులకు తన అవసరం ఎంతో ఉందని, అందుకే పెళ్లి వాయిదా వేయాలని వరుడి కుటుంబ సభ్యులను కోరారు అపూర్వ. 
 
అందుకు వారు నిరాకరించడంతో పెళ్లే వద్దనుకున్నారు. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు కాదనలేకపోయారు. గతేడాది కొవిడ్‌తో తన తండ్రిని కోల్పోయారు అపూర్వ. కొవిడ్‌ సోకిన వారి కుటుంబ సభ్యుల మనోవేదన, కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కనుకే వివాహం వాయిదా వేయాలని కోరినట్లు ఆమె తెలిపారు.