గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (20:13 IST)

నాయకత్వం వహించడం మోదీకి తెలీదు, బ్యాటింగ్ చేయడం సచిన్‌కు తెలియదు!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వార్తల్లో నిలిచింది. మహారాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచిన కంగనా రనౌత్.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లపై విమర్శలు చేసింది. 
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ ట్విటర్‌లో ఓ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండటంతో బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. నాయకత్వం వహించడం మోదీకి తెలీదు, బ్యాటింగ్ చేయడం సచిన్ టెండూల్కర్‌కి తెలీదు అంటూ వ్యాఖ్యానించారు.
 
కంగన ఇచ్చిన ట్వీట్‌లో, ''ఎలా నాయకత్వం వహించాలో మోదీకి తెలీదు, ఎలా నటించాలో కంగనకి తెలీదు, ఎలా బ్యాటింగ్ చేయాలో సచిన్‌కి తెలీదు, ఎలా పాడాలో లతా మంగేష్కర్‌కి తెలీదు, కానీ ఈ చిండీ ట్రోల్స్‌కి అన్నీ తెలుసు, దయచేసి #Resign_PM_Modi ji, ఈ విష్ణు అవతారం ట్రోల్స్‌లో ఒకరిని తదుపరి భారత ప్రధాన మంత్రిగా చేయండి'' అని పేర్కొన్నారు.
 
#Resign_PM_Modi హ్యాష్‌ట్యాగ్ మంగళవారం ఉదయం నుంచి ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మన దేశంలో కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం విజృంభణకు కారణం ప్రధాని మోదీయేనని ఓ వర్గం నెటిజన్లు ఆరోపిస్తున్నారు.