శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (16:56 IST)

సుమ కనకాలను ట్రోల్ చేస్తున్న జనం.. కారణం ఏంటో తెలుసా?

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాలను సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బుల్లితెరపై రాణిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సుమ ప్రస్తుతం నెటిజన్ల ట్రోల్‌కు గురైంది. తాజాగా సుమ పై కొందరు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా క్రూరత్వం కనిపించలేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
 
సుమ తనకు సంబంధించిన కామిడీ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులను తెగ పంచుకుంటుంది. అంతేకాకుండా తను ఇంట్లో చేసే అల్లరి పనులను కూడా తెగ షేర్ చేస్తుంది. 
 
ఇక ఆమెకు మూగజీవుల అంటే ఇంకా ఇష్టం. అలాంటిది తాజాగా ఆమె పెట్టిన వీడియోలు క్రూరత్వం కనిపించిందని నెటిజనులు మండిపడుతున్నారు. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో సుమ ఓ ఆవు, దూడ పిల్లతో సమయాన్ని గడిపింది. ఇక దూడ పిల్లను రాముడు అంటూ దగ్గరికి పిలుచుకుంటుంది.