శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:58 IST)

యాంకర్ శ్యామలకు తప్పని వేధింపులు.. కెమెరామెన్లు అర్థరాత్రి పూట..?

సినీ ఇండస్ట్రీలో నటనకు పరిచయమైన ఎంతోమంది నటీమణులు కొన్ని రకాల వేదనలో చిక్కుకొని ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. తాజాగా యాంకర్ శ్యామల కూడా  ఆమెకు జరిగిన సంఘటన గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఆమె చిన్నతనంలోనే సీరియల్స్‌లో అడుగుపెట్టింది. పలు సీరియళ్లలో నటించిన ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరలో కొన్ని ప్రోగ్రామ్లలో యాంకర్‌గా చేసింది. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యింది.  
 
తనకు సినీ ఇండస్ట్రీల ఇబ్బంది తగ్గించిన అంశాలు చాలానే ఉన్నాయని చెప్తోంది. ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో ఈమెకు తండ్రి లేడని, తల్లితో ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న కొందరు ఇన్ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడేవాలట. ఇక వాళ్లతో మాట్లాడినందుకు తన తల్లి క్లాస్ పీకేదట. ఇక ఆ సమయంలో ఇన్ డైరెక్ట్ ప్రపోజల్స్ కూడా ఎదురవడంతో ఇక అక్కడి వరకే నటించి వెళ్ళిపోదామనుకున్నాదట. అంతేకాకుండా ఓ సమయంలో తనను కెమెరా మెన్స్ కూడా భయపెట్టారట.
 
ఒక సీనియర్ కెమెరామెన్ తనకు అర్ధరాత్రి ఫోన్లు చేసి వేధించేవాడని, ఆ ఫోన్ తన తల్లి దగ్గర ఉండేదని.. ఇక తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేస్తే మీరు మగ దిక్కులేని వాళ్లు.. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలను. మీ అమ్మాయి నేను వెళ్లి మాట్లాడుతుంటే పట్టించుకోవడం లేదు మీరైనా చెప్పండి అంటే తన తల్లితో బెదిరించేవాడట. ఇక ఆ సమయంలో తన తల్లి భయపడి ఎవరికి చెప్పాలో తెలియక ఆ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ కి ఈ విషయాన్ని గడిపిందట. ఇక ఆయన మేనేజర్ ని పిలిపించి మాట్లాడించగా.. వారిద్దరూ ఫ్రెండ్స్ కావడం వల్ల ఆ కెమెరా మా నేను తీసేయాలేదట. తర్వాత ఆమె ఆ ప్రోగ్రాం నుండి తప్పుకుందట.
 
ఇక తను ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతావో చూస్తానంటూ బాగా బెదిరించేవాడని తెలిపింది. ఇక అవన్నీ తట్టుకోలేక వెళ్ళిపోదామనే సమయంలో.. గోరింటాకు సీరియల్‌లో ఫస్ట్ టైం హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందని తెలిపింది. ఇక తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి సీరియల్లో కూడా అవకాశం వచ్చిందని శ్యామల చెప్పుకోచ్చింది.