సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (17:10 IST)

విడిపోయాక మమ్మీడాడీ బాగున్నారు : శృతిహాసన్

విశ్వనటుడు కమల్ హాసన్. ఈయన మొదటి భార్య సారిక. వీరికి శృతిహాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కమల్ హాసన్ - సారికలు విడిపోయి చాలా కాలమైంది. కమల్ హాసన్ హీరోయిన్ గౌతమితో కొంతకాలం సహజీవనం చేశారు. వీరిద్దరు కూడా విడిపోయారు. 
 
అయితే, శృతిహాసన్, అక్షర హాసన్‌లు సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తాజాగా కమల్, సారికల కూతురు శ్రుతి హాసన్ అమ్మానాన్నల విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వారు విడిపోవడంపై ‘హర్షం’ వ్యక్తం చేసింది. అదేమిటి అంటే గమ్మత్తుగా సమాధానమిచ్చింది. 
 
'అమ్మానాన్న విడిపోయినప్పుడు నేను చిన్నదాన్ని. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. కలిసున్నప్పటి కంటే విడిపోయిన తర్వాతే వారు సంతోషంగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడనివారు బలవంతంగా కలిసి ఉండడం అంత మంచి విషయం ఏమీ కాదు' అని చెప్పుకొచ్చింది. 
 
వివాహ బంధం నుంచి విడిపోయినా పిల్లలకు మాత్రం చక్కని తల్లిదండ్రులుగా కొనసాగారని వివరించింది. ఇప్పుడు అమ్మా బాగుంది.. నాన్నా బాగున్నాడని పేర్కొంది. విడిపోయినా తమతమ ప్రత్యేకతతో సంతోషంగా జీవిస్తున్నారని చెప్పింది. కమల్ మొదటి వివాహం భరతనాట్య నర్తకి వాణీ గణపతితో జరిగింది. పదేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.