ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:36 IST)

తిరుమల బ్రహ్మోత్సవాలు : భక్తులకు అనుమతి ఉందా? లేదా? : వైవీ ఏమన్నారు?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఇవి అక్టోబ‌రు 7వ తేదీ నుంచి అదే నెల 15వ తేదీ వరకు వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు. అయితే, ఈ బ్రహ్మోత్సవాలను గత యేడాది తరహాలోనే ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ, తిరుమ‌ల తిరుప‌తిలో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుపుతామ‌న్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. థర్డ్‌ వేవ్‌పై రకరకాల అంచనాలున్నాయన్నారు. 
 
ముఖ్యంగా, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ యేడాది కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతమగానే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది కూడా బ్ర‌హ్మోత్స‌వాలు ఆల‌యానికే ప‌రిమితమ‌వుతాయ‌ని చెప్పారు. వాహ‌న సేవ‌ల‌న్నీ ఆల‌య‌ప్రాకారానికి ప‌రిమితమ‌వుతాయ‌ని వివ‌రించారు.