1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tirumala Tirupati Devasthanams: New members list

నూతన టీటీడీ పాలక మండలి ఖరారు: తెలంగాణ కోటా నుంచి 10 మందికి?

Tirumala Tirupati Devasthanams
నూతన టీటీడీ పాలక మండలి ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ టీటీడీ పాలక మండలి పై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఈ సారి ఏకంగా 25 మంది రెగ్యులర్ సభ్యులతో పాలక మండలి ఏర్పాటు కానుంది. 
 
ఇందులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి, భూమన, మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ కొనసాగనున్నారు. అలాగే. ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది ఈ టీటీడీ పాలక మండలిలో ఉండనున్నారు.
 
ఇక తెలంగాణ కోటా నుంచి 10 మందికి అవకాశం కల్పించనుండగా.. తమిళనాడు, కర్ణాటక, మరియు మహారాష్ట్రల నుంచి కూడా పాలక మండలిలో చోటు కల్పించనున్నారు. అయితే.. విధాన నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి పాత్ర ఉండబోదు.
తర్వాతి కథనం
భారతదేశపు మొట్టమొదటి ఫుడ్‌-గ్రేడ్‌ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ సదుపాయం ప్రారంభించిన శ్రీచక్ర పాలీప్లాస్ట్‌