సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (11:55 IST)

టీటీడీలో మూడువేలకు పైగా ఉద్యోగాల భర్తీ.. ఫేక్ న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ కాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అనేక మంది నిరుద్యోగులు ఇది నిజమని నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు.
 
కొందరైతే టీటీడీలో తమకు తెలిసిన వారిని సంప్రదించి ఎలాగైనా తమకు ఓ ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నారట కూడా. అయితే ఈ అంశంపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేసింది. 
 
ఉద్యోగాల భర్తీ కోసం టీటీడీ ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదని స్పష్టం చేసింది. నిరుద్యోగులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలు నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ విడుదల చేసిన ఈ ప్రకటనతో ఉద్యోగాల భర్తీ వార్త అవాస్తవమని తేలింది.