1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. SBI Recruitment 2021 Manager Vacancy

ఎస్బీఐ.. మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

SBI Recruitment 2021
భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.
 
పోస్టు పేరు: మేనేజర్‌ (రిటైల్‌ ప్రొడక్ట్స్‌)
అర్హత: ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా బీఈ లేదా బీటెక్‌ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
 
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్నవారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఎంపికచేస్తారు. వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
 
అప్లికేషన్‌ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 12
About Writer
సెల్వి
తర్వాతి కథనం
లక్కీ డ్రాలో రూ.కోటి గెలుచుకున్నారని మోసం.. వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య