సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (14:57 IST)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగవకాశాలు.. 8500 పోస్టుల భర్తీ

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగవకాశాలున్నాయి. భారీ ఎత్తున నియామకాలు చేపట్టింది. ఏకంగా 8500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల కాలపరిమితికి ఈ అప్రెంటిస్ పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. 
 
డిగ్రీ అర్హతతో పాటు ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు డిసెంబర్‌ 10 వరకు బ్యాంక్ వెబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మొత్తం పోస్టులు 8500 కాగా, ఇందులో జనరల్ 3595, ఓబీసీ 1948, ఈడబ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ విభాగంలో 725 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి.
 
ముందుగా రాత పరీక్ష రాయాల్సి వుంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక అప్ప్లై చేసే వారికిస్థానిక భాష మీద పట్టు ఉండాలి. దేశవ్యాప్తంగా 8500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, అందులో 1100 పోస్టులు తెలుగు రాష్ట్రాలకు కేటాయించగా అందులో తెలంగాణలో 460 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 620 ఖాళీలను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది.