శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (14:11 IST)

కెనరా బ్యాంకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 220 పోస్టులకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు కెనరా బ్యాంకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్1, స్కేల్2 స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ఈ నియామకాన్ని చేపట్టారు. మొత్తం 21 విభాగాల్లో 220 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
వేతనాలు పోస్టుల ఆధారంగా వుంటాయి. ఒక అభ్యర్థి కేవలం ఒకే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థి ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజును డిపాజిట్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 
 
అప్లికేషన్ల స్వీకరణకు ప్రారంభ తేదీ: నవంబర్ 25
అప్లికేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ: డిసెంబర్ 15