మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (15:10 IST)

అమేజాన్ కొత్త బిజినెస్.. ఇక మందులు కూడా ఇంటికొచ్చేస్తాయ్

అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమేజాన్ తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టింది. కస్టమర్స్‌ అభిరుచులకు అనుగుణంగా వినూత్న సర్వీసులతో దూసుకువచ్చింది. అమేజాన్‌లో ఇకపై కస్టమర్లు మెడిసన్స్‌ కూడా ఆర్డర్‌ ఇవ్వొచ్చు. అంటే దుస్తులు, షూలు, ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌ మాదిరిగానే మెడిసన్స్‌ కూడా ఆర్డర్‌ ఇవ్వొచ్చు. అమెజాన్‌ ప్రస్తుతం అమెరికాలో ఈ మెడిసన్‌ డెలివరీ సర్వీసులను అందుబాటులోకి తీకువచ్చింది. 
 
తద్వారా అమేజాన్ మందులను ఇంటి వద్దకే అందించనుంది. కానీ అమేజాన్‌ ఇదే సర్వీసులను అంతర్జాతీయంగా కూడా ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అమేజాన్‌ ఈ కొత్త సర్వీసులను అమేజాన్‌ ఫార్మసీ పేరుతో అందిస్తోంది. అమేజాన్‌ కొత్త నిర్ణయంతో అమెరికాలోని వాల్‌గ్రీన్స్‌, సివిఎస్‌, వాల్‌మార్ట్‌ వంటి డ్రగ్‌ రిటైలర్లకు షాక్‌ తగలనుంది. 
 
అమేజాన్‌ ఫార్మసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా కస్టమర్లు మెడిసన్స్‌ను ఆర్డర్‌ ఇవ్వొచ్చు. అంతేకాకుండా అమేజాన్‌ తన కస్టమర్లకు అదిరిపోయే డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది. మెడిసన్స్‌ కొనుగోలు చేసే లాయల్టీ క్లబ్‌ మెంబర్లకు భారీ డిసౌంట్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది.