తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైన! సినిమా అంటే వాళ్లకి ఓ పండుగే.. జిగేల్ రాణి
తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరైన్ పూజా హెగ్డే తెలుగు సినీ ప్రేక్షకులను ఆకాశానికెత్తేసింది. ఎవరైనా సరే తెలుగు సినీ ప్రేక్షకుల తర్వాతేనంటూ చెప్పుకొచ్చారు. పైగా, వారికి ఓ సినిమా విడుదలవుతుందంటే.. ఓ పండగేనని వ్యాఖ్యానించింది.
అతికొద్దికాలంలో అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ హీరోయిన్‌గా ఉంది. స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తోంది.
ఒకవైపు టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు మూవీ లవర్స్ గురించి ఓ ఉత్తరాది వ్యక్తి దగ్గర ఆకాశానికెత్తేసింది. పూజాహెగ్డే మాటలు విని షాకవడం ఎదుటి వ్యక్తి వంతైంది.
ఇంతకీ తెలుగు ప్రేక్షకుల గురించి పూజా ఏం మాట్లాడిదంటే... 'తెలుగు ప్రేక్షకులు సినిమాలను అమితంగా ప్రేమిస్తారు. స్టార్స్‌ను దేవుళ్లుగా పూజిస్తారు. ఓ తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లో రూ.150 కోట్లు, రూ.200 కోట్లను వసూళ్లు చేస్తున్నాయంటే కారణం ప్రేక్షకులే.
ఓ సినిమాను చాలా ఇష్టపడి పదేపదే చూస్తారు. సినిమాను, స్టార్స్‌ను ఎంతగా ప్రేమిస్తారంటే థియేటర్‌కు పెద్ద పెద్ద డ్రమ్స్‌తో వస్తారు. డాన్సులేస్తారు. పేపర్లు చల్లుతారు. సినిమా అంటే వాళ్లకి ఓ పండుగే' అని టకటకా చెప్పుకొచ్చింది.
పైగా, నటిగా తనని తాను నిరూపించుకోవడానికి, తెలియని విషయాలను తెలుసుకోవడానికి టాలీవుడ్ ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పి తెలుగు సినిమాపై తనకున్న ప్రేమను పూజా హెగ్డే వ్యక్తం చేసింది.