సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (19:12 IST)

''ఆహా''కు హోస్ట్‌గా మారిన సమంత అక్కినేని.. అంతా బిగ్ బాస్ ఎఫెక్ట్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా ప్లాట్ ఫామ్‌లో హోస్ట్‌గా మారిపోయింది సమంత అక్కినేని. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఆహా వేదికగా ఒక టాక్‌షో చేయబోతుంది సమంత. సినీ ప్రముఖులు ఇందులో తమ మనసులో భావాలు ఆమెతో పంచుకుంటారు. గతంలో మంచు లక్ష్మి చేసిన టాక్ షోలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో సమంత షో కూడా అంతకుమించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు నిర్వాహకులు. 
 
నవంబర్ 13 నుంచి ఈ టాక్ షో మొదలు కానుంది. ఇందులో సమంతకు అత్యంత సన్నిహితుడు, టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ సహాయకుడిగా ఉంటాడు. ఒక స్టార్ హీరోయిన్ హోస్ట్‌గా మారి చేస్తున్న టాక్ షో కావడంతో ప్రేక్షకుల్లో కూడా దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. 
 
సినిమాలే కాకుండా వెబ్ సిరీస్, డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై దృష్టి పెట్టింది సమంత. ఈ క్రమంలోనే తాజాగా యాంకర్‌గా మారిపోతుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ వేదికగా బుల్లితెరపై కనిపించిన సమంత ప్రస్తుతం మరో షోకు యాంకర్‌గా మారడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
 
గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ సినిమాలు చేసింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్ సినిమాల్లో కలిసి నటించింది. ఇద్దరితోనూ సమంతకు మంచి అనుబంధం ఉంది. అయినా కూడా త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి ఈమె ఆసక్తి చూపించకపోవడం విశేషం. 
 
పెళ్లికి ముందు టాప్ హీరోయిన్‌గా మంచి మార్కులేసుకున్న సమంత ముఖ్యంగా పెళ్లికి తర్వాత సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదు. కొన్ని క్రేజీ అవకాశాలు వస్తున్నా కూడా వాటిని పెద్దగా ఆసక్తి చూపించడం లేదు సమంత. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ అవకాశాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.