బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (17:36 IST)

మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ రికార్డ్: రూ.4.5కోట్లకు కొనుగోలు.. ఆనంద్ దేవరకొండ ఖాతాలో?

Middle class medlodies
అమేజాన్ ప్రైమ్ వీడియోలో మిడిల్ క్లాస్ మెలోడీస్‌కు బాగా కలిసొచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌కు ఆరు మిలియన్ (66 లక్షలు) వ్యూస్ లభించాయి. అమేజాన్ ప్రైమ్‌ వీడియోలో రాబోయే తెలుగు ఫ్యామిలీ కామెడీ-డ్రామా, మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ సినిమాలో మధ్యతరగతి ప్రజలు, వారి కలలు, నమ్మకాలు, పోరాటాల గురించి తేలికపాటి చిత్రం. ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ నటించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికే పండుగ మూడ్‌ని వెలిగించింది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లోనే 66 లక్షల వీక్షణలు కలిగివుంది. అభిమానుల మధ్య అపారమైన నమ్మకాన్ని కలిగివుంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు వినోద్ అనంతోజు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించిందన్నారు. ''నా తొలి చిత్రం పట్ల విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు లభించడం ఎంతో సంతోషంగా వుంది. ట్రైలర్ ప్రారంభించినప్పటి నుండి, తనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుండి శుభాకాంక్షలు, సందేశాలు, ప్రశంసలు అందుతున్నాయి. ఇది ఒక మధ్యతరగతి వ్యక్తి సంబంధించిన కలలకు హాస్యాస్పదమైన సన్నివేశాలను జోడించి.. ఫుల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరించిన ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు.  
 
ఈ చిత్రం గురించి నిర్మాత వి ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ, "మిడిల్ క్లాస్ మెలోడీస్ ఒక ఆహ్లాదకరమైన చిత్రం. మా ప్రొడక్షన్ హౌస్‌లో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ చిత్రం మధ్యతరగతి కుటుంబాల జీవితాల గురించి మాట్లాడుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలలో సంబంధాలు, వారి దినచర్యలు, ఆహారపు అలవాట్లకు అద్దం పడుతుందని తెలిపారు. 
 
భవ్యా క్రియేషన్స్ నిర్మించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. భారత దేశం.. ఇంకా 200 దేశాలు, అమేజాన్ ప్రధాన సభ్యులు నవంబర్ 20, 2020 నుండి ప్రత్యేకంగా ప్రైమ్ వీడియోలో మిడిల్ క్లాస్ మెలోడీలను వీక్షించవచ్చు. ఈ సినిమా అమేజాన్‌కు రూ.4.5కోట్లకు అమ్ముడు పోయిన రెండో చిత్రంగా నిలిచింది.
 
ఇది ఆనంద్ దేవర కొండ సినీ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రమనే చెప్పాలి. నిజానికి ఇది చాలా చిన్న సినిమానే. కానీ అమేజాన్ మాత్రం ఫ్యాన్సీ మొత్తాన్ని చెల్లించి తీసుకుంది. మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా బాగా వచ్చాయని యూనిట్ వారు చెప్తున్నారు.