1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (13:27 IST)

ఈ-కామర్స్ సంస్థలకు ఎర్త్ పెట్టిన కేంద్రం.. 15 రోజులు టైమ్

ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం ఎర్త్ పెట్టింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ 16 నుంచి 21 వరకూ పండుగ ఆఫర్లు ఉంటాయని ప్రకటించగా, అమేజాన్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 
 
ఇక పండుగ సీజన్‌ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు గ్రేట్‌ ఇండియన్‌ సేల్స్‌, బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తీరుపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి, ఇతర మూలాలు తెలిపే సమాచారం పొందుపరచకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
 
దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ రెండు ఈ-కామర్స్‌ దిగ్గజాలకు నోటీసులు జారీ చేసింది. స్పందించేందుకు 15 రోజుల సమయం ఇచ్చింది. ఇకపై ఈ నిబంధనల్ని ఏ ఈ-కామర్స్‌ సంస్థ విస్మరించరాదని స్పష్టం చేసింది.