శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (18:08 IST)

ఎస్బీఐ గుడ్ న్యూస్.. కార్డులతో 50 శాతం తగ్గింపు

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వచ్చింది. లైఫ్‌స్టైల్‌స్టోర్.కామ్‌తో ఎస్‌బీఐ జతకట్టింది. ఇందులో భాగంగా కస్టమర్లకు 50 శాతం తగ్గింపు అందిస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డ్స్‌పై అదనంగా మరో 30 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 
 
ఎస్‌బీఐ అందించే ఈ ఆఫర్లు కేవలం ఎస్‌బీఐ యోనో యాప్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. మీరు రూ.1999లోపు షాపింగ్ చేస్తే 15 శాతం అదనపు తగ్గింపు కూడా పొందొచ్చు. అదే రూ.10,000 షాపింగ్ చేస్తే అదనంగా 30 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇలా తగ్గింపు పొందాలని భావిస్తే ఎస్‌బీఐ అందించే కోడ్స్‌ను మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. 
 
స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. లైఫ్‌స్టైల్‌స్టోర్స్.కామ్‌లో కొనుగోలుపై 80 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. 50 శాతం వరకు తగ్గింపుతోపాటు 30 శాతం వరకు అదనపు తగ్గింపు పొందొచ్చని తెలిపింది.