శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:36 IST)

అమీర్‌పేటలో అదృశ్యమవుతున్న వృద్ధ మహిళలు

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో వృద్ధ మహిళలు అదృశ్యమైపోతున్నారు. ఇది స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా అమీర్‌పేటకు చెందిన అస్మత్‌ ఉన్సీసాబేగం, మహమ్మదీ అనే ఇద్దరు వృద్ధ మహిళలు కనిపించకుండా పోయారు. వీరిద్దరిని గుర్తు తెలియని వ్యక్తులే కిడ్నాప్ చేశారు. వారిద్దరి చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ వేసి అమీన్‌పూర్‌లోని ఓ గదిలో నిర్భంధించారు. ఆ గదికి తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
అయితే కిటికీ వద్దకు వచ్చి రక్షించాలంటూ మహిళలు కేకలు వేయడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి వారిని కాపాడారు. అనంతరం అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన ప్రధాన నిందితుడితోపాటు మరో నలుగురిపై కేసు నమోదుచేశారు. ఆస్తికోసం మిరాజ్‌ అనే వ్యక్తి వారిని కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.