శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:50 IST)

భార్య మృతి.. 15 రోజులుగా కుమార్తెపై తండ్రి లైంగిక దాడి..

కన్నతండ్రే కూతురిపై లైంగికదాడికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. భార్య మరణించిన తర్వాత రాక్షసుడిలా మారి, కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌ పరిధిలో దారుణం జరిగింది. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
 
విషయం తెలుసుకున్న స్థానికులు ఆమె తండ్రిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం డయల్ 100కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.