సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:10 IST)

ఈనెల 25న మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25వ తేదీన మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 26న దిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. 
 
ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ శనివారం ఢిల్లీ వెళ్లే  అవకాశముంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది. 
 
ఢిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, ఆర్​ అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి... రాష్ట్రం తరఫున ఉంచాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు.