మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (13:16 IST)

బారాబంకిలో ఢీకొన్న బస్సు - ట్రక్కు : 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
గురువారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌కు వెళుతుండగా ఇసుక బస్తాలను తీసుకెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.