సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (12:25 IST)

సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ ఓ గే : శ్రీరెడ్డి కామెంట్స్

హీరోయిన్ సమంతకు వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్‌గా ఉన్న ప్రీతమ్ జుకాల్కర్‌పై నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయనో గే అంటూ ఆరోపించారు. పైగా, సమంతకు, ప్రీతమ్‌కు మధ్య ఎఫైర్ నడుస్తుందన్న వార్తలను ఆమె ఖండించారు. ప్రీతమ్ ఓ గే అని, అందువల్ల వారిద్దరి మధ్య ఎఫైర్స్ ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, సమంత, ప్రీతం జుకాల్కర్‌లకు ఎఫైర్ వస్తున్న ఆరోపణలను, రూమర్స్‌ని కొట్టిపారేసింది. అందుకు తనకు తెలిసిన పాయింట్‌ని ఆధారంగా చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి చెప్పిన పాయింట్ ఏంటంటే.. ప్రీతం జుకాల్కర్ ఒక గే అని.. అందుకే ప్రీతంతో ఇబ్బంది లేదనే ఉద్దేశంతోనే సమంత అతడితో స్నేహం చేసి ఉండొచ్చని శ్రీరెడ్డి వివరించింది.