1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:16 IST)

సమంత నా సోదరి, ఐల‌వ్‌యూ అన‌కూడ‌దా? (Video)

Preetam- Sam
ఈ ఫొటో చూశారుక‌గా. స‌మంతా స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్‌తో క‌లిసి ఇలా సేద‌తీరుతున్న ఫొటో గ‌తంలో సోష‌ల్‌మీడియాలో స‌మంత పెట్టింది. ఆ త‌ర్వాత ప‌లుర‌కాలుగా అది వైర‌ల్ అయింది. చివ‌రికి స‌మంత విడాకుల వ‌ర‌కు  వెళ్ళింది. వీరిద్ద‌రి మ‌ధ్య వున్న‌ది సోద‌రి ప్రేమ అంటూ స‌మంత స్నేహితురాలు, న‌టి కూడా సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఇది ఇప్పుడు అక్కినేని అభిమానుల కోపం తారా స్థాయికి చేరింది. తనకు ప్రాణహాని ఉందని ప్రీతం మీడియా ముందు వాపోతున్నారు.
 
సోష‌ల్ మీడియా ఇంటరాక్షన్లో ప్రీతం జుకాల్కర్ మాట్లాడుతూ “నేను సమంతను ‘జిజి’ అని పిలుస్తానని చైత‌న్య‌కు తెలుసు. అంటే సోదరి అని అర్ధం. మా మధ్య లింక్ ఎలా ఉంటుంది? ఒక సోదరి లేదా స్నేహితుడిపై ప్రేమను వ్యక్తం చేయకూడదా? అంటూ ప్ర‌శ్నించారు.

బాధపడుతున్నప్పుడు ఓ సోదరిని ప్రజలు ఇలాంటి పుకార్లను ఎలా వ్యాప్తి చేస్తారు ? ఇది చాలా దారుణం. సమంత, నాపై ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడితే బాగుంటుందని అనుకున్నా” అంటూ తామిద్దరినీ కలిపి చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించారు. ఇక తనకు ప్రాణహాని ఉందని, సోషల్ మీడియాలో తనకు తెలియని అపరిచితుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన వెల్ల‌డించారు.