సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (13:37 IST)

పిల్లలు వద్దనుకున్నానా? అదంతా తప్పుడు ప్రచారం..: సమంత

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న నేపథ్యంలో.. సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు విడాకుల విషయంలో సామ్‌దే తప్పు అని దెప్పి పొడుస్తున్నారు.

సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని.. అబార్షన్ చేయించుకుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఇక తాజాగా వీటిపై సమంత స్పందించింది. వాటిని తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగ ట్వీట్ ఒకటి పోస్ట్ చేసింది.
 
"నాకు అఫైర్స్ ఉన్నాయని.. పిల్లలు వద్దనుకున్నానని, అవకాశవాదినని.. అబార్షన్లు చేయించుకున్నానని" తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సమంత మండిపడింది.

ఇలా తనపై పర్సనల్‌గా ఎటాక్ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. విడాకులు తీసుకోవడం ఎంతో బాధతో కూడుకుందని.. ఈ కఠిన సమయంలో తనకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు"అంటూ సమంత ట్వీట్ చేసింది. 
 
ఇదిలా ఉంటే.. తాజాగా చై-సామ్ విడాకులపై నిర్మాత నీలిమ గుణ షాకింగ్ కామెంట్స్ చేసింది. సామ్ తల్లి కావాలనుకుందని.. కానీ ఇంతలోనే ఏదో జరిగిందని ఆమె వెల్లడించింది.