శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (12:30 IST)

అన్నింటికి నిశ్శబ్దమే సమాధానం... కవితాత్మక ధోరణిలో సమంత పోస్ట్

టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరుగాంచి అక్కినేని నాగచైతన్య, సమంతల ఐదో పెళ్లి వార్షికోత్సవ వేడుక నేడు. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారు. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ఈ అంశంపైనే విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతుంది. 
 
సామాజిక మాధ్య‌మాల్లో ఎన్నో వ‌దంతులు వ‌స్తోన్న నేప‌థ్యంలో స‌మంత అధికారికంగా ఏమైనా ప్ర‌క‌ట‌న చేస్తుందా? అన్న విష‌యంపై నెటిజ‌న్లు చాలా ఆస‌క్తిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో స‌మంత ఈ రోజు చేసిన ఓ పోస్ట్ మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. 
 
'పాత ప్రేమ పాటలు.. పర్వతాలు.. శిఖరంపై చ‌లికాలంలో గాలి శ‌బ్దం.. పోగొట్టుకున్న పాత సినిమాల‌ పాటలు దొరికినప్పుడు... మ‌న‌సులోని బాధను ప్రతి ధ్వనించే ప్రేమ పాటలు... పాత బంగ్లాలు... మెట్ల మార్గాలు... సందులలో గాలివీస్తున్న శబ్దం'... అంటూ సమంత క‌వితాత్మ‌క ధోర‌ణిలో ఈ పోస్ట్ చేసింది. 
 
మరోపక్క, రేపు ఆమె లక్మే ఫ్యాషన్ షోలో పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఫ్యాష‌న్ దుస్తులు ధ‌రించి ఆమె ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలోను బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆమె ముఖం ఉండ‌డం గ‌మ‌నార్హం.