1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (20:11 IST)

ఎన్‌.టి.ఆర్‌. షోకూ స‌మంత‌! ఏం చెబుతుందోన‌ని ఆస‌క్తి!

Samantha- Mahendrababu
ఇటీవ‌లే ఓ యాడ్‌ఫిలింలో న‌టించిన స‌మంత తాజాగా ఎన్‌టిఆర్‌. చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఆమ‌ధ్య ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన `ఆహా`లో సామ్‌పేరుతో ఓ టీవీ షోకూడా స‌మంత లీడ్ చేసింది. అందులో త‌న కుటుంబంలోని విష‌యాల‌ను కొన్ని స‌ర‌దాగా షేర్ చేసుకుంది. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. ఆమె ఎక్క‌డికి వెళ్ళినా అక్కినేని నాగ‌చైత‌న్య గురించే అడుగుతార‌నే విష‌యం ఆమెకూ తెలుసు. అందుకే వాటిని ప‌టాపంచ‌లు చేయాల‌నుకుందే ఏమో కానీ టీవీలో షోలో పాల్గొన‌నుంది.
 
ఆమె డేట్స్ చూసే మేనేజ‌ర్ మ‌హేంద్ర‌బాబు త‌న సోష‌ల్‌మీడియాలో స‌మంత ఓ చెక్ అందుకుంటున్న ఫొటో షేర్ చేశాడు. అయితే ఇది అంత‌కుముందే పాల్గొందా?  కొత్త‌గా పాల్గొన‌నుందా? అనే దానికి క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే సామ్ గురించిన ప‌ర్స‌న‌ల్ విష‌యాలు వ‌స్తాయ‌నే ఆస‌క్తి చాలామందిలో నెల‌కొంది. కానీ ఇటువంటి టైంలో పెద్ద‌గా రాక‌పోవ‌చ్చ‌ని కూడా తెలుస్తోంది. ఎన్టీయార్, సమంత జంటగా రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాలు వ‌చ్చాయి. ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ ఆస‌క్తిక‌లిగించేదిగా వుంటుంద‌ని సినీ ప‌రిశ్ర‌మ భావిస్తోంది. ట్విస్ట్ ఏమంటే, నాగ చైత‌న్య డేట్స్ కూడా మేనేజ‌ర్ మ‌హేంద్ర‌బాబు చూడ‌డం విశేషం.